ప్రముఖ తమిళ హీరో సూర్య సోదరుడు కార్తీ కథానాయకుడుగా రీమాసేన్, ఆండ్రి జెరోమియా హీరోయిన్లుగా ఆర్.రవీంద్రన్ సమర్పణలో డ్రీమ్ వేలీ కార్పొరేషన్ పతాకంపై శ్రీ రాఘవ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘యుగానికి ఒక్కడు’ చిత్రం ఆడియో జనవరి మొదటి వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు రవీంద్రన్ మాట్లాడుతూ ‘‘అత్యంత భారీ వ్యయంతో శ్రీ రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ ఫాంటసీ థ్రిల్లర్ ఇది. రామోజీ ఫిలింసిటీ, కేరళలోని చాలకుడి, రాజస్థాన్‌లోని జైసీన్మర్ ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ చేసాం. ప్రస్తుతం రీ-రికార్డింగ్, మిక్సింగ్ జరుగుతోంది. జనవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేసి సంక్రాంతి కానుకగా సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.రవీంద్రన్, నిర్మాణం: డ్రీమ్ వేలీ కార్పొరేషన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ రాఘవ
Movie Name : Yuganiki Okkadu
Year : 2010
Cast : Karthik Sivakumar, Reemasen, Andrea Jeremiah...
Music : GV Prakash
Director : Selva Raghavan
Banner: Dream Valley Corporation
Producer : Ravendran R






No comments:
Post a Comment